బాబు కేసునుంచి బయటపడేందుకే నానా తంటాలు
– మంత్రి హరీష్
హైదరాబాద్,జూన్20(జనంసాక్షి):
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏం చేసినా చంద్రబాబు తన తప్పును కప్పి పుచ్చుకోలేరని పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రజలను, తెలంగాణ విూడియాను మేనేజ్ చేయలేరని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నిప్పు కాదని, రాజకీయాలకు పట్టిన తుప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడ ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలేకరులతో మాట్లాడుతూ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తప్పుల విూద తప్పులు చేస్తూ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బురదలో కూరుకు పోయిన వారు పక్కవారి విూద బురద చల్లాలని చూసినట్టు చంద్రబాబు వైఖరి ఉందని పేర్కొన్నారు. తప్పులు చేస్తూ పట్టుబడ్డ చంద్రబాబు నేను తప్పులు చేసినా పట్టుకోవద్దు, తాను చేసింది తప్పు కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎసిబికి పట్టుబడ్డది వారు, ఫోన్/-లో మాట్లాడి దొరికిదంఇ వారని, కానీ కేసులు పెట్టొద్దన్న చందంగా బాబు వైఖరి ఉందన్నారు. ఉల్టా తమ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై కేసులు పెట్టి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తాము కేసులు పెట్టదల్చుకుంటే ఎన్నో పెట్టవచ్చని, కానీ విజ్జతతో వ్యవహరిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తప్పులను తాము పట్టుకోవడమే తప్పు అన్నట్టు చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి స్టీపెన్‌సన్‌కు డబ్బులు ఇస్తే ఒప్పట, పట్టుకుంటే తప్పట ఇదేం న్యాయమని హరీష్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను, గవర్నర్‌ను కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. తప్పును పట్టుకున్న తెలంగాణ పోలీసులను కూడా తప్పు పడుతున్నారని వివరించారు. రేపు నరేంద్ర మోదీది కూడా తప్పే అనేలా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తలవంపులు తెచ్చుకున్నారని దానికి తాము బాధ్యులం కాదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆంధప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో ఉండటం రాజ్యాంగ విరుద్ధమని…దీనిపై ?కేంద్రం, గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. చంద్రబాబే టీడీపీ కార్యాలయం ద్వారా కేసీఆర్‌పై కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఆ కేసులపై ఇంకా సిట్ కూడా వేశారని అన్నారు. కేసీఆర్‌పై నమోదైన కేసులపై సిట్ వేయడం సిల్లీ థింగ్ అని పేర్కొన్నారు.తెలంగాణ బిడ్డలు అనుకుంటే చంద్రబాబు నాయుడపై లక్ష కేసులు పెట్టి తిప్పగలరని హెచ్చరించారు. అది విజ్ఞత కాదని అన్నారు.
తెలంగాణ అమరవీరులు ఆత్మహత్యలు చేసుకున్నపుడు చంద్రబాబు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసిపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సూసైడ్ నోట్ మరణ వాంగ్మూలంతో సమానమని దాని ఆదారంగా చంద్రబాబుపై కేసులు పెట్టలేమా? అని అన్నారు. చంద్రబాబు లాగా పిచ్చి ప్రేలాపనలు
చేయమన్నారు. మేం చంద్రబాబును ఇరికించాలంటే చాలా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఏపీ పోలీసులను పెట్టుకుంటున్నారు సరే మరి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు పోయినపుడు కూడా ఏపీ పోలీసులనే తీసుకుపోతాడా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆంధ్రులు ఉన్నారు వాళ్ల కోసం అక్కడ ఏపీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. దేని కోసం విూ పోలీసు స్టేషన్లు అని నిలదీశారు. పోలీసులు తెచ్చుకున్నారు కానీ నీళ్లు కూడా తెచ్చుకుంటారా? అని అడిగారు.
హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల అంశంపై గవర్నర్ స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా? అని అన్నారు. చంద్రబాబును కట్టడి చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. అర్ధరాత్రి టీ న్యూస్‌కు నోటీసు ఇస్తారా? విూడియా సంస్థ తెల్లవారే సరికే పోతుందా అని మండిపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణ పునర్ నిర్మాణంపైనే తమ దృష్టి ఉందని ఆ రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులన్నీ తెలుగు ప్రజలకు తెలుసని విమర్శించారు. తప్పుని తప్పు అంటే తెదేపా నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్టేఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడింది నిజమో? కాదో? చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనుమతి లేకుండా ఇళ్లు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి ప్లాన్‌ను జీహెచ్‌ఎంసీ తిరస్కరిస్తే దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహించారు.