బాబు జీవితమంతా అవినీతిమయం:కన్నా
హైదరాబాద్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన జీవితం అంతా అవినీతి మయం అన్నారు. చివరకు సీఎం రిలీఫ్ ఫండ్‌లో కూడా అవినీతి జరిగింది చంద్రబాబు హయాంలోనే అని తెలిపారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు మాదిరిగా కోర్టు నుంచి తాను స్టేలు తెచ్చుకోలేదని చెప్పారు. అటువంటి చంద్రబాబు అవినీతి మంత్రులను తొలగించాలని నిన్న గరర్నర్‌ను కలవడం విచిత్రంగా ఉదన్నారు. క్విడ్‌ప్రోకో కేసుకు సంబంధించి 26జీవోల్లో తన ప్రమేయం లేదని చెప్పారు. రాజకీయంగా తనని ఎదుర్కొనే ధైర్యంలేకే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.