బాబు సభకు తరలనున్న నేతలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కరీంనగర్‌ పర్యటనకు జిల్లా టిడిపి శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతినిధులు మంగళవారం ఉదయిం బయలుదేరి వెళ్లేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. ఇందుకు నేతలు తరలి వస్తారని   ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు జిల్లాలోని పార్టీశ్రేణులు భారీ తరలివెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ నుంచి ఎందరు వెళ్లినా కొత్గా నాయకులు పుట్టుకుని వస్తారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం టిఆర్‌ఎస్‌ నేతలు  పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఒక్కరిద్దరు పార్టీని వీడినంత మాత్రన తెదేపాకు వచ్చే నష్టమేవిూ లేదని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడు ఉద్యమంలో పాలుపంచుకోని నాయకులు స్వార్థం కోసం బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.  రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని ఆంధ్రా పార్టీగా చెప్పుకోవడం దారుణమని అన్నారు.   తెరాస ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం విస్మిరంచిందన్నారు.  ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ హావిూలను బుట్టదాఖలు చేశారని లోలం విమర్శించారు.  ఎన్నికలో ఇచ్చిన హావిూలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. అతివృష్టి, అనావృష్టితో జిల్లా ప్రజానీకం అల్లాడుతున్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కారించడంలో విఫలమవుతున్నారన్నారు. గతంలో తెదేపా హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన విషయం ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని చెప్పారు.