బాబు సునావిూలో విపక్షాలు కొట్టుకుపోవడం ఖాయం

మంగళగిరి రిసార్టులో లోక్‌సభ పరిధి సవిూక్షలు
రాజమండ్రి సవిూక్షకు హాజరైన గోరంట్ల బుచ్చయ్య
అమరావతి,మే4(జ‌నంసాక్షి): చంద్రబాబు సునావిూలో విపక్షాలు కొట్టుకుపోకతప్పదని టీడీపీ సీనియర్‌ నేత,మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్‌ను అడ్డంపెట్టుకుని బిజెపి ఆడిన నాటకానలు ప్రజలు గమనించారని అన్నారు. అలాగే ఇసిని అడ్డుపెట్టుకుని ఇంకా కోడ్‌ పేరుతో ఎపిపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గ సవిూక్షకు హాజరైన సందర్భంగా  విూడియాతో మాట్లాడుతూ, తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తాను 25వేల మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి ఉధృతిలా టీడీపీ గెలుపు ఉండబోతోందని గోరంట్ల స్పష్టం చేశారు.  సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ  సవిూక్షలు జరపనుంది. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సవిూక్ష జరపాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను సవిూక్షకు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు ఈ జాబితాలో ఉన్నారు. రోజుకు 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఈసారి సవిూక్షలను విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో జరపనున్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండటంతో స్ధలాన్ని మార్చారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశాలను వినియోగించుకోబోతున్నారు. సమావేశాల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తెదేపా జాతీయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దన్‌, కార్యాలయ కార్యదర్శి రమణ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దారపనేని నరేంద్ర తదితరులు పరిశీలించారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సవిూక్షలు జరిగే రోజుల్లో రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ రోజుల్లో సవిూక్ష సమావేశాలు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి.