బారికేడ్లపై ట్రాక్టర్లను ఎక్కించి

ఢిల్లీ రైతులకు మద్ధతుగా బయలుదేరిన ఉత్తరఖండ్‌ రైతులు

– అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం

ఉధమ్‌సింగ్‌నగర్‌,డిసెంబరు 25 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో రైతుల నిరసన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలో రైతులు, పోలీసులకు మధ్య టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బాజ్‌ పూర్‌ ప్రాంతంలో రైతులు ఆందోళనలు చేస్తుండగా, వారు మరింత ముందుకు రాకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, ఓ రైతు తన ట్రాక్టర్‌తో ఆ బ్యారికేడ్లను ఢీకొని ముందుకు వెళ్లాడు. ఓ వైపు పోలీసులు, మరోవైపు రైతులు ఇద్దరి మధ్య ¬రా¬రీ నడించింది. ట్రాక్టర్‌ ముందుకు రాకుండా పోలీసులు బ్యారికేడ్‌ వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ట్రాక్టర్‌ నడుపుతున్న రైతు మాత్రం దూకుడుగా ముందుకు వెళ్లాడు. చివరకు రైతు బ్యారికేడ్‌ను దాటి ముందుకు వెళ్లాడు. 28 సెకన్ల ఈ వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రచురించింది ఈ వీడియో చూస్తున్నంత సేపు ఎవరికైనా ఆ ట్రాక్టర్‌ పోలీసుల విూదకు దూసుకు వెళ్తుందేమో అని భయం వేస్తుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్‌, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు సుమారు నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఈ నిరసన జరుగుతోంది. అలాగే, ఆయ ? రాష్ట్రాల్లో కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తామని చెప్పింది. అయితే, వాటిని రైతులు తిరస్కరించారు. ఇలా రెండుసార్లు జరిగింది. చట్టాలను రద్దు చేయాలనేదే తమ డిమాండ్‌ అని, అది చేయకుండా ప్రభుత్వం తమ విూద తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.