బారి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవ్వరూ బయటకు రావద్దు
సహాయ చర్యలు అధికారులు వెంటనే స్పందించాలి.
ముందస్తు సహాయక చర్యల్లో పాల్గొనడానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
ములుగు జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21.
ఈరోజు మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉదృతిని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పరిశీలించారు.
మరో మూడు రోజుల పాటు ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ అధికారులు ప్రకటన మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు అనుకోకుండా తలెత్తితే సహాయ చర్యలకు వెంటనే స్పందించాలని కోరారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగుండా ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
సహాయక చర్యల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సహాయ సహకారాలు అందిచాలని జడ్పీ చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమం జడ్పీ కో ఆప్షన్ సభ్యులు వాలియబీ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, పిఏసీఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, స్థానిక ఎమ్మార్వో వీరస్వామి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు గదాదాసు సునీల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్ధార్ పాషా,సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కునూరు మహేష్ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు ఈసం స్వరూప,సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు ఈసం రామ్మూర్తి,రామన్నగూడెం సర్పంచ్ దొడ కృష్ణ, వంక దేవేందర్ ఎంపీటీసీలు అల్లి సుమలత శ్రీనివాస్, స్వప్న చంద్రబాబు, కోట నర్సింహులు, రామన్నగూడెం గ్రామకమిటి అధ్యక్షులు ఇట్టెం నాగరాజు, రోయ్యుర్ ఉపసర్పంచ్, అల్లంల చంటి, స్థానిక నాయకులు సప్పిడి రాం నర్షయ్య,పిఏసీఎస్ డైరెక్టర్ మాదారి రామయ్య, శ్రీనివాస్, చిన్నబోయిన పల్లి గ్రామాకమిటీ అధ్యక్షులు గుజ్జెటి రాజశేఖర్, జాడి భోజరావు,లొటపిటల రాజేష్, కాళ్ళ రామకృష్ణ, మందపల్లి చంద్రమ్,మహిలా నాయకులు, సయ్యద్ సఫియా,దొడ్డ వాణి, తదితరులు పాల్గొన్నారు.