బాలుర బీసీ వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు
ఖమ్మం(సంక్షేమం): నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు జడ్డి కల్యాణ్‌రావు, డీఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగ పరుచుకొని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమలరావు, డాక్టర్ జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.