బాలుర హాస్టల్ ను సందర్శించిన చైర్ పర్సన్ పుట్ట శైలజ

 జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలుర ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ ను సోమవారం మంథని మునిసిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు పుట్ట శైలజ సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని, హాస్టల్ సిబ్బందికి, విద్యార్థులకు ఆమె సూచించారు.