బాల్క సుమన్ కాబోయే మంత్రి..!!
అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్ కితాబు
మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సైతం అందుక బలం చేకూరుస్తున్నాయి. నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నవారు చేయని పనులను కూడా సుమన్ చేసి చూపించారని కొనియాడారు. భవిష్యత్తులో మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారని మంత్రి కేటీఆర్ అనడంతో ఈలలు, కేకలు, కరతాళ ధ్వనులతో స్థానిక బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా జోష్ నెలకొంది. స్వయంగా కేటీఆరే ఈ వ్యాఖ్య చేయడంతో ఆయనకు ప్రమోషన్ లభించినట్టేనని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.