బాల్యాన్ని మింగేస్తున్న స్టార్ట్ ఫోన్లు
మానసిక నిపుణుల ఆందోళన
హైదరాబాద్,నవంబరు 20(జనంసాక్షి): ఆటపాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీలు పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక క్షోభను అనుభవి స్తున్నారు. ఒకప్పుడు అనురాగాలు, అప్యాయతలతో గడిచిన బాల్యం నేడు మారుతున్న సాంకేతికతతో అన్నిరకాల అప్యాయతలను కోల్పోతోంది. కరోనా కాలంగా ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన చిన్నారులు టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్ వంటివాటితో గడపాల్సి వచ్చింది. మరోవైపు ఆన్‌లైన్ తరగతుల కారణంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలు అనివార్యంగా దగ్గరయ్యాయి. ఇరవై ఏళ్ల క్రితం వరకు చిన్నారులకు అన్నం తినిపించాలంటే వారి తల్లులు చందమామను చూపెట్టో, పాటలు పాడో, కథలు చెబుతో తినిపించేవారు. కానీ నేటితరం పిల్లలు స్మార్ట్‌ఫోన్, టీవీలు లేనిది ముద్ద తినడం లేదు. మారుతున్న సాంకేతికత, పరిజ్ఞానం రోజురోజుకూ చిన్నారులను వారి తల్లిదండ్రులకు దూరం చేస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర బాధ్యతలతో తల్లిదండ్రులు బిజీగా ఉంటూ చిన్నారి పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతుంది. బాల్యం ప్రతీ ఒక్కరి జీవి తంలో ఆనందమైన జ్ఞాపకం. కానీ నేటి తరం చిన్నారులు మాత్రం ఆ ఆనంద క్ష ణాలకు దూరమవుతూ వారికే తెలియని ఒంటరి జీవితాలను గడుపుతున్నారు. ఉదయం లేవగానే పాఠశాలకు వెళ్లడం సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్‌లు ఇవి సాధారణంగా పెద్దపిల్లలకు ఉండే రోజు వారి దినచర్యలు. కానీ కరోనా సంక్షోభంతో ఉదయంనుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వారికి అవే కాలక్షేపంగా మారాయి. దీనికి విరుగుడు ఆలోచించాలి. పెద్దలు పిల్లకు కథల రూపంలో విద్యను అందించాలి. తల్లిదండ్రులు తమవంతు బాధ్యతగా వారికి చదువు చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఇపస్పటి వరకు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్థులైతే ఆ చిన్నారులు సైతం ట్యూషన్‌లకు వెళ్లాల్సిందే. ఇలా పగలంతా చదువులతో కుస్తీ పడుతూ సాయంత్రం ట్యూషన్‌లు ఇంటికి రాగానే టీవో, సెల్‌ఫోన్‌లతో ఆటలు ఇలా చిన్నారుల జీవితాలు అనురాగాలు, అప్యాయతలకు దూరమవుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళితే సాయం త్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు. నేడు ఎటు వెళ్లినా.. ఫోన్‌లలో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకరకంగా మారుతున్న టెక్నాలజీ వల్ల కొంత ప్ర యోజనాలు ఉన్నా దాని వల్ల అనర్థాలే ఎక్కు వగా ఉంటున్నాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితిని దాటాం. కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ దశలో పిల్లలను ఒంటరిగా ఉండకుండా, అదేపనిగా ఫోన్లకు అలవాటు పడకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.