బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి రెండేళ్ల చిన్నారి మధులత దుర్మరణం చెందింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా తాత వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. కుక్కలు వెంటపడటంతో పరిగెడుతూ వెళ్లి బావిలో పడింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.