బాసరలో భక్తుల సందడి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): బాసర సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి భక్తుల రాక ఉదయం నుంచే పెరిగింది.ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే అభివృద్ధి పనుల పర్యవేక్షణ నిమిత్తం దేవాదాయశాఖ 8 మందితో కూడిన ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు  ప్రభుత్వం  నియమాక ఉత్తర్వులు జారీ చేసింది.   త్వరలో ఆలయానికి పాలకమండలిని నియమించనున్న తరుణంలో అనూహ్యంగా పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేయడం పలు ఉహగానాలకు తావిస్తోంది.కమిటీలో బాసరకు చెందిన నూకం రామారావు, ఉమారాణి, బదింసాకు చెందిన ఆనంద్‌కోకాటే, మైసేకర్‌ సాయిలు, నిర్మల్‌కు చెందిన లక్ష్మీనారాయణ, కుభీర్‌కు చెందిన దత్తురామ్‌, కుంటాలకు చెందిన చందప్రకాష్‌/-నడ్‌, తరోడాకు చెందిన నర్సాగౌడ్‌లను నియమించారు. మూడునెలల కాలపరిమితితో కమిటీ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.