బిందుసేద్యంతో మేలు
ఆదిలాబాద్,ఆగస్ట్2(జనం సాక్షి):రైతులు తక్కువ ఖర్చుతో బిందు సేద్యం పరికరాలతో కూరగాయలు, పండ్ల తోటలను పెంచుకోవాలని ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి ఎ.గణెళిశ్ సూచించారు.బిందు సేద్యం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. బిందు సేద్యం, ఎరువుల సరఫరా, స్కీన్ర్ ఫిల్టర్‌ను వివరించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం వంద శాతం రాయితీతో, బీసీలకు 90 శాతం రాయితీతో ప్రభుత్వం అం దజేస్తోందని చెప్పారు. వ్యవసాయంలో రైతులు సాగుభూమిలో పంటమార్పిడి పద్దతిని పాటించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను రైతులకు వివరించారు. ఎరువుల కొరత ఎక్కడా లేదన్నారు. ఆగస్టు 31 వరకు వరిపంటకు ఇన్సూరెన్సు చేయించుకోవచ్చన్నారు.