బిఆర్‌జిఎఫ్ పనులు మంజూరు
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): బ్యాక్‌వర్డ్ రిజియన్ గ్రాంట్ ఫండ్ (బిఆర్‌జిఎఫ్) కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 23 పనులకు రూ. 1.75కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరాకు వినియోగించుకోనున్నారు. వారం రోజుల్లో ఈ పనులకు టెండర్లు కుదిర్చేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.