బిఆర్‌జిఎఫ్ 2వ విడత నిధులు మంజూరు
ఖమ్మం, జూలై 23 : 2011-12 సంవత్సరం రెండవ విడత బిఆర్‌జిఎఫ్‌లో 2134 పనులకు గాను 12.34 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా పరిషత్ సిఇఓ దేవరాం అన్నారు. మంజూరైన పనులలో 20శాతం పూర్తయ్యాయని తెలిపారు. జనరల్ పనులకు 73 కోట్లు, ఎస్సీ ప్రాంతాల పనులకు 2.4 కోట్లు, ఎస్టీ ప్రాంతాల పనులకు గాను 3.27 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయితీల గ్రాంట్లకు 5,19,34,854, మండల పరిషత్‌ల గ్రాంటు 3,16,14,085, జిల్లా పరిషత్ గ్రాంటు 1,80,93,061 రూపాయలు, మున్సిపాల్టీలకు 2,17,57,000 రూపాయలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా చేపట్టే పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని దేవరాం అన్నారు. కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడితే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.