బిజెపిని ఆశీర్వదించండి..

ఇల్లందు నవంబర్ 22 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక సింగరేణి కాలరీస్ స్కూల్ గ్రౌండ్ లో భారత జనతా పార్టీ విజయ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర బిజెపి చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటిఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణికి పుట్టినిల్లు అయినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో భారత జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిరిజన గాంధీ అని పిలవబడే దారావత్ రవీంద్ర నాయక్ నీ అత్యధిక మెజార్టీతో మీరు ఆశీర్వదించి గెలిపించాలని ఇల్లందు ప్రజలను కోరారు. భారత జనతా పార్టీ గెలుపొందిన వెంటనే ఇల్లందు నియోజకవర్గంలో సింగరేణి బిడ్డలుగా పనిచేస్తున్న కార్మికులకు రక్షణ విభాగంలో దేశబార్డర్లో పనిచేస్తున్న జవాన్లకు ఏ విధమైన ఇన్కమ్ టాక్స్ లేకుండా చేయబడినదో అదే ప్రకారం ఇక్కడ సింగరేణి ఉద్యోగస్తులకు కూడా ఇన్కమ్ టాక్స్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇల్లందు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య కొమరారం బోర్డు మండలాల ఏర్పాటుకై ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బి ఆర్ ఎస్ పార్టీలు మండలాలగా ఏర్పాటు చేస్తామని కాలయాపన చేస్తూ మాటల వరకే పరిమితం అయ్యాయి బిజెపి అధికారంలోకి రాగానే ఆ రెండు మండలాలను వెంటనే ఏర్పాటు చేసే బాధ్యత చేపడుతామని తెలిపారు. లక్ష కోట్లు వెచ్చించి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యమైన కారణంగా లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ధ్వజమెత్తాడు. కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే పనులు తప్ప ఆపార్టీల వలన ఒరిగేది ఏమీ లేదన్నారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా కింటాకు 10 కేజీల తరుగు తీసి రైతులను సైతం మోస చేసే పనులు కేసీఆర్ చేశాడు మాట మీద నిలబడలేని కేసీఆర్ మాట తప్పని నరేంద్ర మోడీకి దేనిలోనూ సరిపోడు అని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ఇంధనాలపై తక్షణమే వ్యాట్ తొలగిస్తామని తెలిపారు. అధికారం వచ్చిన ఆరు నెలల లోపే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామన్నారు గ్యాస్ సిలిండర్ పై ధరలు తగ్గించే ప్రయత్నం కచ్చితంగా చేస్తామన్నారు. నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి ధారావత్ రవీంద్ర నాయక్, రంగ కిషోర్ జిల్లా అధ్యక్షులు, నాళ్ళ సోమ సుందర్ ఉపాధ్యక్షుడు, శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి, మౌనూరు మాధవ్,మైనార్టీ మోర్చా కార్యదర్శి విమల్ జోన్, ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ గోపికృష్ణ, మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, జర్పుల రామ్ బీరౌ, బాలాజీ, జర్పుల రామారావు, జస్వంత్, ఠాగూర్, ఈసం వెంకట్, యువమోర్చా నాయకులు రమేష్, మురళి, శ్రీకాంత్, రామ్ లాల్, సందీప్, తదితరులు పాల్గొన్నారు