బిజెపిలోకి ఇక కొత్తనీరు
యువతను ప్రోత్సహించేలా చర్యలు
తిరుగులేని నేతగా మోడీ ప్రస్థానం
న్యూఢల్లీి,డిసెంబర్21( జనం సాక్షి): భారీతీయ జనతాపార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తుంచుకుని పోయి..
ఏకస్వామ్య వ్వవస్థ ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మోడీ పగ్గాలు చేపట్టిన తరవాత అంతా ఆయన చుట్టే రాజకీయం నడుస్తోంది. ఆయన తీసుకునే నిర్ణయాలను ఎవరు కూడా వేలెత్తి చూపడం లేదు.
పల్లెత్తు మాట అనడంలేదు. మోడీకి పార్టీలో తిరుగులేకున్నా ఆయన నిర్ణయాలను ఎదరించలేని దుస్తితి నెలకొంది. ఏకపక్ష నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పుడంతా బిజెపిలో మోడీయిజం పెరిగింది. అందుకే సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినా పెద్దగా స్పందన రావడం లేదు. బిజెపి థింక్ ట్యాంకర్‌లలో ప్రముఖంగా ఉన్న అద్వానీ, జోషిల జమానా ముగిసింది. దీంతో వారు ఇంటికే పరిమితం అయ్యారు. నామమాత్రంగా కూడా వారికి పార్టీలో ప్రవేశంª` లేకుండా చేశారు. అంతేగాకుండా పెద్దగా ప్రాధాన్యం కూడా లేకుండా పోయింది. ఈ ఇద్దరు అగ్ర నాయకులకు ఇప్పుడు బిజెపిలో పెద్దగా విలువ లేకుండా
పోయింది. పార్టీలలో వ్యక్తుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయిందనడానికి మోడీ భజనే నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే నోట్ల రద్దు,జిఎస్టీ తరవాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నా ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. అందుకు ఇటీవల సాగుచట్టాలు తీసుకుని రావడం..దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో రద్దు చేయడం జరిగింది. దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో పార్టీలో ఆమె అధికారానికి తిరుగులేకుండా పోయింది. ఆమెను మించి ఇప్పుడు 19 రాస్ట్రాల్లో
అధికారంలో ఉన్నామని మోడీ చెప్పడం, ఆమెకన్నా మనమే గొప్పని చాటడం ద్వారా పార్టీలో తిరుగలేదని పించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బిజెపిలో ఎదురులేకుండా ఎదుగు తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తిస్వామ్యం ఉంటుంది. మమతా బెనర్జీ, జగన్,చంద్రబాబు, కెసిఆర్ తిరుగులేని నాయకులుగా ఉన్నారంటే అవి ప్రాంతీయ పార్టీలు అని భావించాలి. కానీ బిజెపి లాంటి పార్టీలో మోడీ ఏకఛత్రాధిపత్యం కొనసాగించినా, విపరీత నిర్ణయాలు తీసుకున్నా విమర్శించే నాయకులు కానరావడం లేదు. ప్రధానమంత్రిగా ఉన్నవారు పార్టీని మించి ఎదిగినప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు. మోదీ ముందు ఆడ్వాణీ వంటివారి వేదనలు, మనోహర్ జోషి లాంటి వారి పెద్దరికం పనిచేయదు. ఇందిరాగాంధీ హయాంలో కూడా కాంగ్రెస్ దేశంలో 18 రాష్టాల్ల్రోనే పరిపాలించ గల్గింది. కానీ ప్రస్తుతం భాజపా, మిత్రపక్షాలు 19 రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నాయి. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో మోడీకి తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. దీంతో రానున్న కాలంలో ఆయన నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించినా పట్టించుకోరు. అందుకే పార్టీలో సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీలం బిజెపికి పట్టుగొమ్మలుగా ఉన్న సీనియర్ల స్థానంలో వచ్చే పార్లమెంటుకు యువనేతలను తయారు చేయడం ద్వారా పార్టీలో తనకు ఎదురులేని విధంగా పరిస్థితులును తయారుచేసుకోవాలన్నది మోడీ లక్ష్యంగా ఉంది. నూతన భారతం కోసం కొత్త తరాన్ని ప్రోత్సహించాలని మోదీ గతంలోనే ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న తప్పుడు ప్రచారంతో ప్రభావితం కావొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యాచరణ ఎన్నికల విజయానికి తల్లి వంటిదని మోదీ అభివర్ణించడం ద్వారా పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో సూచించారు. పార్టీ నిర్మాణం, యువ నేతలను ప్రోత్సహించడం గురించి మోదీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మొత్తంగా యువతను ప్రోత్స హించడం మొదలయ్యింది. అలాగే సీనియర్లకు ఉద్వాసన కూడా చెప్పారు. ఇదే క్రమంలో మరింతమంది యువనేతలను ప్రోత్సహించి వారికి రాజకీయ బాధ్యతలు అప్పగించే కార్యక్రమం రానున్న రోజుల్లో కనిపించనుంది.