బిజెపి ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా పనిచేయాలి

అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గుల్బర్గా ఎమ్మెల్యే ఏం.బసవరాజు

వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి)

వనపర్తి బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము,అధ్యక్షతన బూత్ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వనపర్తి అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గుల్బర్గా గ్రామీణ ఎమ్మెల్యే ఏం.బసవరాజు హాజరయ్యారు.
అనంతరం నాయకులు లను ఉద్దేశించి
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ అవినీతి ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల ఊబిలోకి నెట్టిందని, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియా, భూమాపియా, ప్రశ్నాపత్రాల లీకేజీ మాఫియాలో ఇరుక్కుని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేశారని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేకపోయినప్పటికీ 9 లక్షల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసిందని కానీ నీళ్లు నిధులు నియామకాల పేరిట పోరాడు సాధించుకున్న తెలంగాణలో మన పాలన మన చేతికి వస్తే మనం నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయని, మన నీళ్లు మనం వాడుకుంటే తెలంగాణ రైతులు బాగుపడతారని, నిధులు కొల్లగొడుతున్న ఆంధ్ర వలస పాలనకు తరిమి కొడితే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని నమ్ముకున్న ప్రజలను తెలంగాణలో నియామకాలు కేసీఆర్ కుటుంబానికి,నీళ్లు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గం, నిధులు కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యాయని 2013 ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే దళితుడే మొదటి ముఖ్యమంత్రి, ప్రతి ఇంటికి ఉద్యోగం, రైతాంగానికి అవసరమయ్యే ఉచిత ఎరువుల సరఫరా, లక్ష రూపాయల ఏక మొత్తంగా రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ సాగు భూమి, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల దళిత బంధు తదితర కల్లబొల్లి హామీలతో రెండుసార్లు గద్దెనెక్కిన కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఒక్క హామీ నెరవేర్చకుండా నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికలకు మళ్లీ ఒకసారి అద్భుతమైన ప్రతిపక్షాలు ఆశ్చర్యపరిచేలా మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పడం పూర్తిగా కేసీఆర్ దివాలా కోరుతనానికి నిదర్శనమని నిజంగా కేసీఆర్ కు దమ్ముంటే గతంలో జరిగిన తొమ్మిదేళ్ల పనితీరుపై రాబోయే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయం బిజెపి అని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని బూత్ స్థాయి కార్యకర్తలు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, ఆపై బాధ్యతగల ప్రతి నాయకుడు కూడా రాబోయే 60 రోజులు భ పార్టీకి పూర్తి సమయం ఇచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తే డిసెంబర్ 3న ఏర్పడబోయేది బిజెపి ప్రభుత్వమేనని కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ రాష్ట్రాన్ని గుజరాత్ కు దీటుగా అభివృద్ధి పరిచే ఏకైక దమ్మున్న పార్టీ బిజెపియేనని కావున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డా. ఏ రాజ వర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బీ.శ్రీశైలం,పార్లమెంట్ విస్తారక్ కేతురు బుడ్డన్న, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి సుమిత్ర, కుమారస్వామి, ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, కోశాధికారి బాశెట్టి శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వారణాసి కల్పన, యువమోర్చా జిల్లా అధ్యక్షులు బి.అనుజ్ఞా రెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి.కరీం, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ డి. ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూగురు రాములు, రాయన్న తదితరులు పాల్గొన్నారు.