బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పల్లె బాట

వీణవంక ఆగస్టు 16( జనం సాక్షి) వీణవంక .బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వీణవంక మండలంలోని నర్సింగపూర్ వల్భాపూర్ గ్రామాల్లో బుధవారం రోజున బిజెపి పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు వివిధ గ్రామాల్లో వార్డు లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన పలు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన ఆధారమైన రేషన్ కార్డు ల ను అందించకుండా ప్రజలను ఇన్నేళ్లుగా మోసం చేస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించే పథకాలకు అర్హతలు కలిగి ఉండి కావాల్సిన ఆధారాలు సమర్పించిన పథకాలు సక్రమంగా అమలు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. అందులో ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, వివిధ రకాల పింఛన్లు, దళిత బంధు , బీసీ బందు, గృహలక్ష్మి లాంటి అనేక పథకాలు ఉన్నాయన్నారు. కెసిఆర్ సర్కార్ పథకాలు ప్రకటించడమే కానీ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు ఎక్కడ లేవని విమర్శించారు. వివిధ పథకాలకు నోచుకోకుండా పోయిన ప్రజానీకానికి భరోసా కల్పించడానికి, వారందరికీ తగిన న్యాయం జరగడానికి, కెసిఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రజలందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో బిజెపి పల్లెబాట బస్తీ బాట కార్యక్రమంతో ప్రజల మధ్యకు బిజెపి పార్టీ వచ్చిందన్నారు. ఇందులో భాగంగా అర్హులైన ప్రజలందరి నుండి మరోసారి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి బిజెపి తగిన కృషి చేస్తుందన్నారు.
గురువారం రోజున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన సంక్షేమ పథకాల అర్హులు, లబ్ధిదారులతో జిల్లాలోని అన్ని ఎమ్మార్వో కార్యాలయల ఎదుట బిజెపి ఆధ్వర్యంలోధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి జిల్లా కార్యదర్శి నర్సింహ రాజు నియోజకవర్గ కన్వీనర్ గౌతమ్ రెడ్డి ఐటీ సెల్ కన్వీనర్ వినోద్ కుమార్ కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి దేవేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు రవీందర్ దేవేందర్ రావు శక్తి కేంద్రాల ఇంచార్జిలు శ్రీనివాస్ రజమల్లు గౌడ్ బూత్ అధ్యక్షులు సంతోష్ రాకేష్ శ్రీనివాస్ గణేష్ శ్రీనివాస్ కోమల్ రెడ్డి విజేందర్ రామస్వామి మల్లయ్య కుమార్ మహేష్ రాజయ్య స్వామి వార్డు సభ్యులు నాయకులు తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు