బిజెపి నేత ముధోల్ నియోజకవర్గం నాయకుడు రామారావు పటేల్ హౌస్ అరెస్ట్
భైంసా జూలై19 జనం సాక్షి
నిర్మల్ జిల్లా , ముధోల్ నియోజకవర్గం లోని బిజెపి నేత రామారావు పటేల్ ను అరెస్ట్ చేశారు పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల స్థితిగతుల పరిశీలించేందుకు తరలుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రాంరావ్ పాటిల్ ను పోలీసులు బైంసాలో హౌస్ అరెస్టు చేశారు. ఉదయం వేళలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు చర్యలు చేపడుతుండగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆడ్డుకు అన్నారు. స్వగృహం నుంచి బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేశారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ రాంరావ్ పాటిల్ అందోళనలు చేపట్టారు. అప్రజాస్వామి విధానాలతో బీఆర్ఎస్ సర్కార్ తమ గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ బయటకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ప్రణాళికబద్ధమైన చర్యలతోనున్న పోలీసులు ఆయనను స్వగృహం నుంచి బయటకు వెళ్లనీయకుండా భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంరావ్ పాటిల్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం పథకానికి సంబంధించి తమ వైఫల్యాలు పూర్తి స్థాయిలో బహిర్గతమవుతాయనే ఆందోళనతోనే ప్రభుత్వం తమను కట్టడి చేయిస్తోందని ఆరోపించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసాలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. ముధోల్ నియోజక వర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయిన పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శించారు. ఇందులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు