బిజేపి కార్యాలయంలో జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనగామ (జనం సాక్షి)అక్టోబర్ 11:భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాజపా జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా దశమంత రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఆవిర్భావంలో అన్ని వర్గాలు కులాలు మతాలు పోరాటాల ఫలితమే జనగామ జిల్లా ఆవిర్భావమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి జిల్లా సాధించడం జరిగిందని ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి సాధించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మూర్ఛ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ బిజెపి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ హరిచంద్రగుప్త బోనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ కొంతమంది శ్రీనివాస్ యుగేందర్ రెడ్డి ఇనుగాల జిల్లా ఉపాధ్యక్షులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గుజ్జుల నారాయణ పిట్టల సత్యం రాష్ట్ర నాయకులు సుభాష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మహిపాల్ ప్రధాన కార్యదర్శి కోట వినోద్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కన్వీనర్ అంజిరెడ్డి పెద్దోజు జగదీష్ జిల్లా ప్రచార కార్యదర్శి పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కాసుల శ్రీనివాస్ దేవరుప్పుల మండల అధ్యక్షులు బాలల నవీన్ రెడ్డి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు తోకల హరీష్ ఆకుల క్రాంతి శ్రీకాంత్ కొంగరి అనిల్ కీర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.