బిటి రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే…
కొత్త పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ…*
ఫోటో రైటప్: పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే…
వరంగల్ బ్యూరో సెప్టెంబర్ 21 ( జనం సాక్షి)
నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిలో భాగంగా రూ. 15 కోట్ల వ్యయంతో నల్లబెల్లి నుండి గిర్నిబావి వరకు వయా దుగ్గొండి మీదుగా నిర్మించనున్న బిటి రోడ్డు వెడల్పు పనులకు ఎంపీ. మాలోతు కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
బుధవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రోడ్డుపల శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. మండలంలోని వెంకటాపూర్, రేబల్లె, దుగ్గొండి, దేశాయిపల్లి, గుడి మహేశ్వరం గ్రామాలకు చెందిన కొత్తవి, పాతవి కలుపుకొని మొత్తం 288 ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు.
మండలంలో మొదటిసారిగా రూ. 2016, 3016 పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూనర్సంపేట నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్నవారు మళ్లీ మాన్యువల్ గా ఆఫ్ లైన్ ద్వారా స్థానిక ఎంపిడివో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.వాటిని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత నాదేనని భరోనిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య
తాసిల్దార్ సంపత్ కుమార్. మండల పార్టీ అధ్యక్షులు సుకినె రాజేశ్వరరావు, మండల పార్టీ అద్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.