బిహారీలకు రెండు పండుగలు

Untitled-5
– ఎన్నికల ప్రచార సభలో మోదీ
పాట్నా,అక్టోబర్‌27(జనంసాక్షి): మహా కూటవిూ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని  ప్రధాని

మోడీ మారోమారు విమర్శించారు. నితీష్‌, లాలూ, సోనియాలపై మండిపడ్డారు. అధికారంలో ఉండటమంటే ప్రజలకు సేవచేయడమేనని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మంగళవారం ఆయన సీతామడిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.  బెతియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ… ఈసారి బిహార్‌ ప్రజలు రెండు పండుగలు చేసుకుంటారు. ఎన్నికల ఫలితాల రోజు ఒక పండగ, దీపావళి రోజు మరో పండుగా అని వ్యాఖ్యానించారు. రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఈసీకి ప్రధాని అభినందనలు తెలిపారు. పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు కాంగ్రెస్‌పార్టీ సహకరించట్లేదని విమర్శించారు. బుధావారం మూడో విడత పోలింగ్‌ జరగనుందని, అభివృద్ధికోసం ఓట్లు అడిగేందుకు విూ ముందుకు వచ్చానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు సీతామాడి ప్రాంతంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ … ఈ ఎన్నికల ఫలితాలు బిహార్‌ ప్రజల తలరాతను మార్చేస్తాయన్నారు. అధికారంలో ఉండటమంటే ప్రజలకు సేవ చేయడమేనని, మహా కూటమి నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌ కోసం మూడు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ప్రజలకు విద్యుత్‌, రవాణా, తాగు నీటి సదుపాయం కల్పిస్తామని హావిూ ఇచ్చారు. గతంలో బిహార్‌ రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీని అమలు చేస్తామని హావిూ ఇచ్చారు.