బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అమిత్ షా
-టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి
-తెలంగాణలోని ప్రవళిక రహమత్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ పార్టీ
-పేపర్ లీక్, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మద్యం కుంభకోణం అక్రమ నిర్మాణాలతో 22 000 కోట్లు అవినీతి అమిత్ షా
-100 కోట్ల బడ్జెట్ నిధులను విడుదల చేస్తే దుర్వినియోగం చేసిన కేసీఆర్
గద్వాల ఆర్ సి (జనం సాక్షి) నవంబర్ 18:-బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా..గద్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని విమర్శలు గుప్పించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అబద్ధాపు ప్రచారాలతో ప్రజలన మోసం చేశారని ఫైర్ అయ్యారు. రూ. 70 కోట్లు జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇచ్చారు, కానీ ఆ డబ్బులను కేసీఆర్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్‌ను కేసీఆర్ నిర్మించలేదన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు.కేసీఆర్ సర్కార్ బీసీలను మోసం చేసింది, కానీ బీజేపీ తెలంగాణలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ ద్రోహులని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలని. తెలంగాణలో ఈ పార్టీలకు విముక్తి కల్పించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని అన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు.
బిసి ముఖ్యమంత్రి కావాలంటే బిజెపికి ఓటేయండి: అమిత్‌షా
వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్వాల బిజెపి విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. ఇచ్చిన హామీలను కెసిఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ టైమ్ అయిపోయిందని, బిజెపి వచ్చే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, బిసిలకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. బిసి సిఎం కావాలంటే బిజెపికి ఓటేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను కెసిఆర్ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. జోగులాంబకు మోడీ వంద కోట్లు నిధులు విడుదల చేస్తే కెసిఆర్ వినియోగించలేదని ధ్వజమెత్తారు