బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.

డోర్నకల్, నవంబర్-22, జనంసాక్షి న్యూస్:డోర్నకల్ నియోజకవర్గం
బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రఅభివృద్ధిసాధ్యమవుతుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం డోర్నకల్ మండలంలోని చిలుకోయాలపాడు,మన్నెగూడెం అందనాలపాడు,రావిగుడెం, ముల్కలపల్లి, మల్లయ్యకుంట తండా, జోగ్యతండా, బొడ్రాయి తండా, పెరుమళ్ళసంకిసా, చిలుకోడు, తెల్లబండతండా, బూరుగుపాడు,దుబ్బ తండా, కన్నెగుండ్ల,తోడేళ్లగూడెం ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార నిర్వహించారు. ఆయా గ్రామాలకు
పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మహిళలు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలను ఉద్దేశించి ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని హంగులతో అభివృద్ధి చెందుతుందన్నారు. పూటకో పార్టీ మారే వాళ్ళని నమ్మొద్దని బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.రాష్ట్రంలో వంద సీట్లకు పైగా బిఆర్ఎస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసారి కనిపించే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు చూస్తున్నారని కాంగ్రెస్, బిజెపి మాటలు నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు.తోడేలు, గుంతనక్కన మాటలు నమ్మొద్దని ఈనెల 30 వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి అత్యధికమెజార్టీతో గెలిపించాలని ప్రజలనుకోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ డిఎస్ బాలు నాయక్, జడ్పిటిసి కమల రామనాథం, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, మండల నాయకులు రామనాథం, యూత్ అధ్యక్షుడు అంగోత్ హరీష్, సొసైటీ వైస్ చైర్మన్ ఎల్లమ్మది మన్మధరావు, వివిధ గ్రామాల సర్పంచులు అంగోత్ మోహన్, రాంప్రసాద్, కొండపల్లి రాధిక, బానోతు ఫుల్ సింగ్, తేజావత్ గమ్మి రాజునాయక్, గుగులోత్ శ్రీను, అజ్మీర భారతి బాల్య, పగడాల అంజయ్య, మంద వరలక్ష్మి నాగేశ్వరరావు, రమేష్, మహిళా అధ్యక్షురాలు హైమావతి, ఎంపీటీసీలు నాంజ్యల నాగమణి మధుసూదన్ రావు,నీలా రమేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ నంద నాయక్, ఉప సర్పంచ్లు భాస్కర్, వెంకన్న, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు అమర్ సింగ్, నిమ్మనా కోటేశ్వరరావు, కాడెం బాబు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, వాంకుడోత్ రాజు, అంగోతు లచ్చు వీరన్న,కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.