బీఎస్పీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం
చండ్రుగొండ జనంసాక్షి (జూలై 04) : మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ రవికుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు ఇనమల పిచ్చయ్య మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష అనంతరం వినతిపత్రాన్ని ఇచ్చామన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.ధరణి పోస్టల్ ను రద్దు చేసి ఆన్లైన్ వ్యవస్థను కొనసాగించాలన్నారు.రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాములు నాగరాజు సీతయ్య తదితరులు పాల్గొన్నారు.