బీచ్‌ ఒడ్డున 100 తిమింగలాలు

14చెన్నై: తమిళనాడులోని తుతికోరిన్ సముద్ర తీరానికి గతరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో తిమింగళాలు కొట్టువచ్చాయి. దాదాపు 100 తిమింగళాలు ఒడ్డుకు చేరడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిలో కొన్నింటిని మత్స్యకారులు, ప్రభుత్వ సిబ్బంది సముద్రం లోపలికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మనపాడు, కళ్లమొజి గ్రామాల్లోని సముద్ర తీరానికి తిమింగాలు కొట్టుకువచ్చినట్టు జిల్లా సీనియర్ అధికారి కుమార్ తెలిపారు.

మనపాడు సముద్రతీర ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో తిమింగాలు కొట్టుకురావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇవన్నీ చిన్న మొప్పలు కలిగిన తిమింగళాలు అని తేల్చారు. ఇవి ఎందుకు కొట్టుకువచ్చాయో తెలుసుకోవాలని మనార్ మెరైన్ పార్క్, ఫారెస్ట్ అధికారులను కోరామని రవికుమార్ తెలిపారు. గతేడాది ఆగస్టులో 33 అడుగుల తిమింగళం నాగపట్టణం జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.