బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేశానని, పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారని, అయితే ఆఖరి నిమిషంలో వేరేవాళ్లకి బీఫామ్‌ ఇచ్చి తనను అవమానించారిన తుల ఉమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆమె గులాబీ గూటికి చేరనున్నారని సమాచారం.సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.అయితే వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా తుల ఉమను బీజేపీ మొదటగా ప్రకటించింది.చివరి నిమిషంలో బీ-ఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు.చివరి నిమిషంలో బీ-ఫామ్ వేరే వాళ్లకు ఇచ్చి తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బీఫామ్ లే సరిగా ఇవ్వలేని పార్టీ అధిష్టానం బీసీ నినాదంతో ముందుకు వెళ్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.