బీజేపీపై నితీశ్ నిప్పులు

బీహార్‌లో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 242 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాబితాను వెల్లడించారు. అభ్యర్థుల కేటాయింపులో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని నితీశ్ చెప్పారు. జనరల్ కేటగిరీలో 16, ఓబీసీలకు 55, ఎస్సీ ఎస్టీలకు 16, ముస్లిం మైనారిటీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించినట్లు తెలిపారు. జాబితా ప్రకటన అనంతరం బీజేపీపై నితీశ్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఒకవైపు అభివృద్ధి మంత్రం జపిస్తూనే మరోవైపు జాతి విభజనకు కుట్ర చేస్తోందని ఫైరయ్యారు. రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు బీజేపీ నిజస్వరూపాన్ని బయపెట్టాయన్నారు. బీజేపీకి ఆరెస్సెస్ సుప్రింకోర్టు లాంటిదన్న నితీశ్… ఆరెస్సెస్ ను కాదని బీజేపీ ఏ నిర్ణయం తీసుకోదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కుట్రవల్లే పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో బీహార్ కు 21వ ర్యాంకు కేటాయించారని నితీశ్ విమర్శించారు.