బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలి.
ఫోటో రైటప్: ఎస్సై కి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు.
బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి)
మొహమ్మద్ ప్రవర్తన గురించి కించపరిచే విధంగా మాట్లాడిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలనీ బుధవారం ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇమ్రోజ్ ఆధ్వర్యంలో ముస్లింలు బెల్లంపల్లి వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఇమ్రోజ్ మాట్లాడుతూ ఈ దేశ ముస్లిం సమాజం మానోభావాలు గాయపడేలా, ఈ దేశ పౌరులయినా హిందూ, ముస్లిం లకు మధ్య, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్టం లో మతకలాలు సృష్టించేలా శాంతి సోదరాభవాన్ని చెడగొట్టే విధంగా రాజాసింగ్ ప్రయత్నిస్తునాడని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ ను కఠినంగా శిక్షించాలని ఎంఐఎం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి జమ మస్జీద్ గురువు సాధికుల్ ఇస్లాం ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఎండీ జాకీర్, ఎండీ ఇంతియాజ్, ఎండీ సల్మాన్, ఇంతియాజ్, సుభాని, ఇమ్రాన్, షారుఖ్, సాజిద్, బషీర్, సిరాజ్, ఫయాజ్, సమీ, ఖాజా, యాకుబ్, ఇసుబ్, యాకుబ్ పాల్గొన్నారు