బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే బీరం

చిన్నంబావి అక్టోబర్ 7 జనం సాక్షి

చిన్నంబావి మండల కేంద్రంలోని దగడపల్లి గ్రామంలో దగడపల్లి నుండి తూముకుంట వరకు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి నాలుగు కోట్ల 50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయడం జరిగింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గ్రామ అభివృద్ధి చెందుతుందని ఈరోజు కొన్ని సంవత్సరాలుగా చేయలేని పనిని మన ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనిని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని ప్రతి పథకం పేద ప్రజలకు చేరుతుందని అన్నారు. ఎలక్షన్ల సమయంలో కళ్లిబెల్లి మాటలకు చెప్పి ఓట్లు అడగడానికి వస్తారని అలా వచ్చిన వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మరొకసారి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను దేశంలో మరో రాష్ట్రం చేయడం లేదని దేశానికి తెలంగాణ రాష్ట్ర దిక్సూచి అని తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అన్ని రాష్ట్రాలు పథకాలను కాపీ చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దగడపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బీటీ రోడ్డును ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి నాలుగు కోట్ల 50 లక్షల సొంత నిధులను ఇచ్చి పనిని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరమషవర్ధన్ రెడ్డికి దగడపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం గా గ్రామం నుండి భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, డి ఈ చెన్నయ్య, ఏఈ విద్యాసాగర్ రెడ్డి, సర్పంచ్ సువర్ణమ్మ, ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ పెద్ద మారు సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంద్, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, యువ నాయకులు నారాయణ, కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు