బీరు గుండెకు మంచిది

లండన్‌: రోజుకో అర లీటరు బీరు తాగితే గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని గ్రీస్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 400 మి.లి బీరు తాగితే గుండె చుట్టూ ఉండే రక్తనాళాల సరిస్థితి మెరుగుపడడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, దమనులు మరింతగా మృదువుగా మారతాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఆల్కహాల్‌ లేని బీరు తాగితే ఈ ప్రబావమేమి కనబడేదని తెలిపారు. థూమపానం అలవాటు లేని 17 మంది యువకులను ఎంపిక చేసి ఈ ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం గంట లేదా రెండు గంటల్లోగా వారి గుండె ఆరోగ్యాన్ని పరిశీలించగా ఈ ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.