బీసీసీఐ మాజీ అద్యక్షుడు రుంగ్తా మృతి
ముంబై:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పి.ఎం.రుంగ్తా(84) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని బోర్డు ముఖ్య పరిపాలనాధికారి రత్నాకర్ శెట్టి తెలిపారు. సన్నిహితులు, స్నేహితులు భాయ్‌జీగా పిలుచుకొనే రుంగ్తా 1972-73 నుంచి 1974-75 వరకు మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించారు.