బీసీ బంధులో గీత కార్మికులను చేర్చాలి – తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : గత వందల సంవత్సరాలుగా గీత వృత్తిని నమ్ముకుని కేవలం గీత వృత్తిపై ఆధారపడి కల్లు గీత కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 2 నెలల క్రితం ప్రకటించిన బి.సి బంధు పథకం కార్యక్రమంలో ముందుగా గీత కార్మికులను చేర్చి రెండు రోజుల తరువాత గీత కార్మికులను అందులో నుండి మినహాయించడం జరిగిందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు లేక కల్లు గీత కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ప్రభుత్వం ఇప్పటికైన పునరాలోచించి గీత కార్మిక కుటుంబాలకు ప్రత్యేక ఉపాధి కార్యక్రమం క్రింద ప్రతి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ మధ్య కాలంలో వెలువడిన వైన్స్ షాపు టెండర్లలో కూడా గీత కార్మిక సొసైటీలకు 70 శాతం రిజర్వేషన్ కల్పించి సొసైటీ లను బలోపేతం చేయాలన్నారు. తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ శుక్రవారం కమాన్ పూర్ తహసిల్దార్ మోహన్ రెడ్డికిసర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం శుక్రవారం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాగిరి అంజి గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, పల్లెర్ల శ్రీనివాస్ గౌడ్, బత్తిని నాగమణి, రంగు సత్యనారాయణ గౌడ్, కోలా నరస గౌడ్, బొమ్మగాని అనిల్ గౌడ్, వెంగలి రాజయ్య, నగునూరి నరసయ్య, బుర్ర సత్యం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు