బీహర్‌లో 90 స్థానాల్లో పోటీకి ఎంఐఎం నిర్ణయం
హైదరాబాద్,సెప్టెంబర్12(జనంసాక్షి):
బీహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇతే హదుల్ ముస్లివిూన్ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది. ఈమేరకు తమ పార్టీ బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. బీహార్‌లోని 40 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తామని వెల్లడించారు. బీహార్ రాష్ట్ర ఎంఐఎం విభాగం అధ్యక్షుడిగా అఖ్తర్ ఉల్ ఇమాన్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ అభివృద్ది మండలి ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని పేర్కొన్నారు. సీమాంచల్‌లోని నాలుగు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే బీహార్‌లోని కేవలం సీమాంచల్ ప్రాంతంలోనే పోటీ చేస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. బీహార్‌లోని గత పాలకులంతా సీమాంచల్ ప్రాంతాన్ని పట్టించుకోలేదని తెలిపారు. బీహార్ అసెంబ్లీలో సీమాంచల్ సమస్యలను ఎలుగెత్తుతామన్నారు. ఆర్టికల్ 371 క్రింద సీమాంచల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు ప్రధాన డిమాండ్ గా ఎంపీ అసద్ తెలిపారు.