బీహార్‌లో ట్రక్కు బోల్తా, 25 మంది కూలీలు మృతి
ఔరంగాబాద్: బీహార్ రాష్ట్రంలోని బౌరంగాబాద్ జిల్లా ముఫసిల్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాంలో 25 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. రోహ్తాన్ నుంచి జార్ఖండ్‌లోని లెస్లిగంజ్‌కు కూలీలతో వెళ్ల్తున్న ట్రక్కు ముసఫిల్ వద్ద అదుపుతప్పి బొల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కులో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం సమాచారమందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.