బీహార్‌లో ప్రశాంతంగా మూడో దశ పోలింగ్‌

Untitled-5

– మూడో దశలో చురుకుగా పోలింగ్‌

– 53.32 శాతం ఓటింగ్‌ నమోదు

పాట్నా,అక్టోబర్‌28(జనంసాక్షి):

బిహార్‌ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొన సాగింది. ఆరు జిల్లాల్లోని 50 నియోజకవ ర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పలు నియోజకవర్గాల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్నాలో ఓటు హక్కు విని యోగించుకున్నారు. ఆర్జేడీఅధినేత లాలు ప్రసా ద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్డీదేవి ఆయన కు మారుడు తేజస్వి యాదవ్‌ పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ పట్నాలోని రాజేంద్రనగర్‌లో ఓటు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ… భాజపా కుల రాజకీయాలకు పాల్పడ టంలేదని.. కానీ కుల రాజకీయాలకు బిహార్‌ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.  ఉదయం 8గంటల సమయానికి మొత్తం 4.04శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 808 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,45,85,177 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6,747 పోలింగ్‌ కేంద్రాలను సంక్షోభ కేంద్రాలుగా, మరో 1,909 కేంద్రాలను వామపక్ష తీవ్రవాద ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్లు ఎన్నికల అదనపు ప్రధాన అధికారి ఆర్‌.లక్ష్మమణన్‌ వెల్లడించారు. వీటిని డేగకళ్లతో పహారా కాసేందుకు 5 హెలిక్టాపర్లు, డ్రోన్‌లు ఉపయోగించనున్నారు.

మోడీపై లాలూ విమర్శలు

రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మతాలను వాడుకుంటున్నారని ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ ఆరోపించారు. బిహార్‌ అసెంబ్లీ మూడో విడత ఎన్నికల ర్యాలీలో సోమవారం, మంగళవారం ప్రధాని చేసిన వ్యాఖ్యలు వాటికి ఊతమిస్తున్నాయని బుధవారం లాలు వ్యాఖ్యానించారు. ఓటేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, లాలు ప్రసాద్‌, నితీష్‌ల కూటమి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రమాదకరస్థితిలో ఉంటాయని దేశ ప్రధాని స్థాయికి ఇది తగదన్నారు. మతాల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తారంటూ ప్రధానిగా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు ఇవ్వాల్సిన 5 శాతం రిజర్వేషన్‌ వారికి దూరం చేసి, ఇతర మతాల వారికి ఇస్తారని మోదీ తన ర్యాలీలో పేర్కొనడంపై లాలు మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను దేశంలో ఎవరూ తొలగించలేరని, బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమినిగ్భ్భ్రాంతికి గురిచేస్తాయని చెప్పారు. మహాకూటమి కచ్చితంగా ఈ ఎన్నికలలో విజయం సాధిస్తుందని, తమకు కావలసిన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.