బీహార్‌లో ముగిసిన మొదటి విడత ప్రచారం
– మహా కూటమి ముందంజ
పాట్నా అక్టోబర్10(జనంసాక్షి):
బిహార్ ఎన్నికలు అటు భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు.. ఇటు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పొత్తుతో ఏర్పడిన లౌకికకూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అయిదు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అక్టోబరు 12న మొదటి దశలో 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీయే తరఫÛన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లౌకికకూటమిలో జేడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇరు వర్గాలు పరస్పర విమర్శలతో ప్రచారం ¬రెత్తింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్ మహాకూటమి, బిజెపి నేత్వత్వంలోని ఎన్డీయేల మధ్య ¬రా ¬రీ పోరు సాగుతోంది. విజయం ఏ కూటమిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కొన్ని సర్వేలు ఎన్డీయేకు అనుకూలమంటే మరికొన్ని సర్వేలు మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్-ఐబిఎన్, ఆక్సిస్ జరిపిన సర్వే మాత్రం- మహాకూటమికి మళ్లీ మహర్దశ పడుతుందని పేర్కొంది. ఢిల్లీ మాదిరి బీహార్‌లో కూడా మోది మంత్రం పనిచేయడం లేదా?
గెలుపోటములపై సర్వేలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తుండడంతో గెలుపోటములపై సర్వేలు ఊపందుకున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్-ఐబిఎన్-యాక్సిస్ మై ఇండియా ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నితీష్ మహాకూటమి విజయం నల్లేరు విూద నడకలాంటిదేనని పేర్కొంది. ఎన్డీయే రెండోస్థానంతో సంతృప్తి పడాల్సి ఉంటుందని తెలిపింది.
మొత్తం 243 సీట్లు
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. ఇందులో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్ మహాకూటమికి 129 నుంచి 145 సీట్లు రానున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 122 కన్నా అధికం. బిజెపి నేతృత్వంలోని ఎల్‌జేపి-ఆర్‌ఎల్‌ఎస్పీ,హమ్ కూటమి 87 నుంచి 103 సీట్లు మాత్రమే కైవసం చేసుకోనుందని సర్వేలో తేలింది. ఇతర పార్టీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, ఎఐఎంఐఎం తదితర పార్టీలకు 8 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశముందని సిఎన్‌ఎన్ ఐబిఎన్ సర్వే చెప్పింది. ద టైమ్స్ నౌ- సి వోటర్ జరిపిన ప్రీపోల్ సర్వేలో మాత్రం మహాకూటమి, ఎన్డీయేల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఎన్డీయేకు 119 సీట్లు, మహాకూటమికి 116 సీట్లు రానున్నాయని తెలిపింది. ఇతరులకు 8 సీట్లు రానున్నాయి. అంటే ఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 122 సీట్ల మేజిక్ ఫిగర్ రావడం లేదన్నమాట. ఇండియా టుడే ప్రీపోల్ సర్వేలో ఒక్క సీటు అటు ఇటు కాకుండా నితీష్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ రానుంది. ఎన్డీయేకు 111 సీట్లు, మహాకూటమికి 122 సీట్లు, ఇతర పార్టీలు 10 సీట్లు గెల్చుకుంటాయని సర్వే తెలిపింది. ఎబిపి న్యూస్, నీల్సన్ జరిపిన ప్రీపోల్స్ సర్వే మాత్రం ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ రానుందని పేర్కొంది. ఎన్డీయేకు 128 సీట్లు, మహాకూటమికి 112, ఇతర పార్టీలకు 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
సిఎన్‌ఎన్-ఐబిఎన్-యాక్సిస్ మై ఇండియా సర్వే
సిఎన్‌ఎన్-ఐబిఎన్-యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ముఖ్యమంత్రి రేసులో నితీష్ కుమార్ 43 శాతం ఓట్లతో అందరికన్నా ముందున్నాడు. బిజెపి నేత మాజీ డిప్యూటి సిఎం సుశీల్‌కుమార్ మోది 33 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కేవలం 6 శాతం ఓటర్లే లాలూ ప్రసాద్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అంశంగా ఓటర్లు పేర్కొన్నారు. ఏ సర్వేలో ఎంత నిజముందో అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.