బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్
ఎన్‌డిఎ పక్షాల భేటీలో కూటమి నేతల నిర్ణయం
ప్రమాణస్వీకారం, మంత్రివర్గకూర్పుపై త్వరలోనే ప్రకటన
పాట్నా,నవంబర్15(జనంసాక్షి): బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్ పగ్గాలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాలుగోసారి చేపట్టనున్నారు. ఈ వీషయాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఆదివారం నితీష్ కుమార్ ఇంట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేడీయూతో పాటు బీజేపీ, హెచ్‌ఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి పక్ష నేత, ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్త్‌లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సుదీర్ఘం చర్చల అనంతరం శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్‌ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది.
74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించను న్నట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ముఖ్యమంత్రిగా సోమవారం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో అవావిూ మోర్చా, వికాస్ వీల్ హిన్సాన్ చెరో 4 చోట్ల గెలుపొందింది. మొత్తంగా వరుసగా మరోమారు బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. భాజపా నుంచి రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడణవీస్ వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కూటిమి సమావేశమవడం ఇదే తొలిసారి. స్పీకర్, మంత్రివర్గం కూర్పుపై ఈ కూటమి చర్చించింది. అంతేకాకుండా, బిహార్ ముఖ్యమంత్రిగా ఏరోజు ప్రమాణస్వీకారం చేస్తారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తారు. నితీశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం వరుసగా ఇది నాలుగో సారి.