కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన పర్యటించారు.గణేష్‌ పహడ గ్రామంలో పంటలు దెబ్బతిన్న రైతులతో భేటి అయ్యారు. వరి,పత్తి, మొక్కజోన్న, వేరుశనగ పంటలను కోల్పోయిన రైతుల అభిప్రాయాలు తెలుసుకోనికేంద్ర నిదులతో సాయం అందిస్తామన్నారు. ప్రతి రైతు నష్టాన్ని జాగ్రతగా అంచనా వేయాలని జిల్లా అదికారులను సూచించారు. రైతులు అత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని భరోసా కల్పించారు వరదల్లో మరణించిన చలమప్పగూడెంలోని ఇద్దరు మహిళల కుటుంబానికి ఒక్కోక్కరికి లక్షన్నర రూపాయల చోప్పున పరిహరం అందించారు. అనంతరం అయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు.

 

విజయవాడ: నవంబర్‌ 6, (జనంసాక్షి):

నీలమ్‌ ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలతో బుడమేరు ఉప్సొంగి కృష్ణా జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు మంగళావారం కృష్ణా జిల్లాకు వచ్చిన కిరణ్‌ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. బుడమేరుపైహై కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని, నిధుల కొరత వల్లే డెల్టా ఆధునికీకరణ పనుల్లో జాప్యం చోటు చేసుకున్నదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

వరదల వల్ల సంభవించిన పంట నష్టంపై అంచనాలు  వేయగానే రైతులను అదుకుంటామని, రైతాంగం అధైర్యపడవలసిన పనిలేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రంగు మారిన ధాన్యం, పత్తికి ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సీడీ ఇస్తుందని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన పరిణామాల గురించి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు,యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి తెలుసన్న కిరణ్‌, రైతులకు తప్పక సాయం అందుతుందన్నారు. తన పర్యటనలో భాగంగా సత్తుపల్లి మండలం గంగారం వద్ద వరద పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కిరణ్‌ తిలకించాడు.