బురదలో ఇరుక్కుపోయిన మూడు ఆర్టీసీ బస్సులు

ఆదిలాబాద్ : జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. అకాల వర్షానికి పలు వంతెనల వద్ద బురద ఏర్పడింది. భోథ్ మండలం సాయినగర్ వంతెన వద్ద ప్రమాదం జరిగింది. మూడు ఆర్టీసీ బస్సులో బురదలో ఇరుక్కుపోయాయి. ఆర్టీసీ బస్సులో బురదలో ఇరుక్కుపోయి రెండు గంటల సమయం కావోస్తుంది. బస్సులు బురదలో ఇరుక్కుపోవడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.