బుర్కినా ఫాసోలో విషాదం
బంగారు గనిలో పేలుళ్లు.. 59 మంది దుర్మరణం
పశ్చిమ ఆఫ్రికా : పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్‌బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పెలుడు సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది.ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉన్నది. దేశంలోని బంగారు గనుల్లో సుమారు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కాగా, గామ్‌బ్లోరాలో దాదాపు 8 వందల ఎకరాల్లో చిన్నచిన్న బంగారు గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి టోగో, బెనైన్, నైగర్, ఘనా దేశాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు.