బుర్ఖాతో బడికి రావొద్దు

1

సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ నిర్వాకం

లక్నో మే16(జనంసాక్షి): భారతదేశం సర్వసత్తాక ,లౌకిక ,గణతంత్రదేశం ఎవరి మతానుసారం వ్యవహరించే హక్కు ఉంది. మొన్నటి వరకు బొట్టు పెట్టుకుని బడికి రావద్దని వివాదాల్లో చిక్కుకున్న మిషనరీ స్కూళ్లు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని బుర్కా ధరించి స్కూల్‌కు రావద్దని ఆంక్షలు విధించారు పాఠశాల యాజమాన్యం. లక్నోలోని సెయింట్‌ జోసఫ్‌ ఇంటర్‌ కాలేజ్‌లో ఓ విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే ముఖానికి ఏమి లేకుండా క్లాస్‌కు రావాలని స్కూల్‌ యాజమాన్యం విద్యార్థినికి సూచించారు. స్కూల్‌లో జాయిన్‌ చేసుకునేటప్పుడు బుర్కాతో ఉన్న ఫోటోలను స్కూల్‌ వాళ్లు తీసారని ఆ స్టూడెంట్‌ పేరెంట్స్‌ తెలిపారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాపోతున్నారు విద్యార్థిని తల్లితండ్రులు. యాజమాన్యాన్ని వివరణ అడిగితే ఏమి చెప్పడం లేదని తల్లితండ్రులు జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం పై దర్యప్తు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్‌ రాజశేఖర్‌ అధికారులను ఆదేశించారు.