బుసాన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘బర్పీ’ చిత్రానికి ప్రశంసలు

 

లండన్‌: విదేశీ భాషల చిత్రాల కేటగిరిలో అస్కార్‌ లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన బాలీవుడ్‌ సినిమా బర్ఫీకి బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్టాండింగ్‌ ఇవేషన్‌ లభించింది. అ చిత్రంలో నటించిన రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియంకచోప్రాలు కూడా చిత్ర ప్రదర్శనకు హాజరై ప్రేక్షకుల కరతాళ ధ్వనులను, ప్రశంసలను ప్రత్యుక్షంగా స్వీకరించారు.