బూస్టర్ డోస్ వేయించుకున్న ట్రంప్
హూస్టన్,డిసెబర్21( జనం సాక్షి): అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. కోవిడ్ బూస్టర్ డోసు తీసుకున్నట్లు తెలిపారు. టెక్సాస్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఫాక్స్ న్యూస్ మాజీ ప్రజెంటర్ ఓ రిల్లే ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల గురించి ట్రంప్ మాట్లాడారు. వ్యాక్సిన్ల వల్లే కోట్లాది మంది ప్రాణాలను రక్షించుకోగలిగామన్నారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ విూడియాలో పోస్టు చేశారు. విూరు బూస్టర్ తీసుకున్నారా అని వ్యాఖ్యాత అడగ్గా.. అవును, తీసుకున్నానని ట్రంప్ తెలిపారు. వ్యాక్సిన్ క్రెడిట్‌ను మనమే తీసుకోవాలని, విూరు టీకా వద్దు అనుకుంటే, తీసుకోకండి. కానీ టీకాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ అన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ వేరియంట్ డామినెంట్‌గా మారింది. 73 శాతం కేసులు అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్‌వే నమోదు అవుతున్నాయి. తన మద్దతుదారులు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్రంప్ కోరారు. వ్యాక్సిన్లను రూపొందించి చరిత్ర సృష్టించామని, అమెరికాలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యర్థి పార్టీలకు ఆ క్రెడిట్ దక్కేలా ప్రవర్తించవద్దు అని తన మద్దతుదారులకు ట్రంప్ తెలిపారు.