బెంగళూరు మెట్రో పార్కింగ్‌ ఆదాయం 6.2 కోట్లు

 

బెంగుళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇప్పటికైతే హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎలాంటి పార్కించ్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. రోడ్లవిూద ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేసి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కుతున్నారు. పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ బళ్లను తీసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కానీ మనకంటే ముందు ప్రారంభమైన బెంగళూరు మెట్రో మాత్రం పార్కింగ్‌ చార్జీలు భారీగా బాదుతున్నది. గత ఆరేండ్ల కాలంలో రు.6.2 కోట్లు వసూలు చేశారరని లెక్కలు చెబుతున్నాయి. . 2012-13 2017-18 మధ్యకాలంలో ఈ మొత్తం వసూలు చేశారు. మొదటి సంవత్సరం 2012-13లో రు.23.8 లక్షలు వసూలు కాగా 2017-18లో గరిష్ఠంగా రు.4.1 కోట్లు వసూలయ్యాయి. నిజానికి ఇది కాంట్రాక్టర్లు మెట్రోకు చెల్లించిన వార్షిక రుసుము. పార్కింగ్‌ కాంట్రాక్టర్ల వార్షిక ఆదాయం లెక్కలు తేలలేదు. నాలుగు గంటలకు రు.15, ఆతర్వాత ప్రతి గంటకు రు.5 చొప్పున, గరిష్టంగా రోజంతటికీ రు.30 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో ఇందుకు భిన్నంగా సమగ్ర పార్కింగ్‌ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ ఖాలీలు తెలుసుకుని బుక్‌ చేయడం, చెల్లింపు జరపడం ఇందులో ఉంటాయి. పార్కింగ్‌ లాట్‌లో వ్గై/ వంటి సౌకర్యాలు ఉంటాయి. మొదటి రెండు గంటలకు రు.6, తర్వాత ప్రతిగంటకు రు.3 చొప్పున వసూలు చేస్తారని అంటున్నారు. ఆ సంగతేమోగానీ బెంగళూరు మెట్రోల ప్రయాణికులు పార్కింగ్‌ చార్జీలు కలుపుకుంటే ప్రయాణ చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయని వాపోతున్నారు.