బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకెళ్లిన

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కి మధ్య అంగీకారం కుదరడం లేదు. కలకత్తా హైకోర్టు దీనిపై ఈరోజు తుది నిర్ణయం ప్రకటించవలసి ఉండగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకెళ్లింది. ఎన్నికల సంఘం కోరినంత భద్రతా సిబ్బందిని సమకూర్చడం సాధ్యం కాదని రాష్ట్ర హోంశాఖ చెప్తున్న నేపథ్యంలో ఎన్నికలు మూడు దశల బదులు ఐదు దశలుగా నిర్వహించాలని న్యాయస్థానం సూచిస్తోంది. ఎన్నికల కమిషన్‌ దాదాపు లక్షన్నర భద్రతా సిబ్బంది కావాలని కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం 60 వేల మంది భద్రతా సిబ్బందిని మాత్రమే కేటాయించగలనంటోంది.