బెంగుళూరులో డివైడర్‌ను ఢీకొన్న క్యాబ్
ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం
బెంగళూరు,నవంబర్19జనం సాక్షి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టు నుండి బెంగళూరు నగరంలోకి వస్తున్న ఎస్‌యువి వాహనం డివైడర్‌పై నుండి దూకి అటుగా వస్తున్న క్యాబ్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని చిక్కజాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ క్రాస్‌కు సవిూపంలోని ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్ఘటనలో క్యాబ్ ఎదుట భాగం నుజ్జునుజయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో మహిళతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఎస్‌యువిలో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.