బెయిల్‌ దొరకని సండ్ర

1

– తీర్పు నేటికి వాయిదా

హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి):

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఎసిబి కో ర్టుకు గైర్హాజరయ్యారు. తనకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు షరతులు పెట్టిందని, దాని ప్రకారం హైదరాబాద్‌ కు రాకూడదని రేవంత్‌ తన తరపు న్యాయవాది ద్వారా తెలియచేశారు.అయితే కోర్టు ఆ వాదనను విని, అయినా కోర్టు వాయిదాకు రావాల్సిందేనని స్పస్టం చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి అరెస్టు అయి హైకోర్టులో బెయిల్‌ పొందిన సంగతి తెలిసిందే.మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్‌, ఉదయసింహలు కోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు బెయిల్‌ ఇచ్చే సమయంలో ఇలాంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ సమయంలో తప్ప అని ఆదేశాలలో పేర్కొని ఉంటే ఈ సమస్య ఉండదు కాదన్నారు.మరోవైపు ఈ కేసుకు సబంధించి ఏ-2 సెబాస్టియన్‌, ఏ-3 ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. చార్జిషీటు వేసిన తర్వాతే కోర్టుకు రావాలని అప్పటి వరకు మినహాయింపు ఉంటుందని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆగష్టు 3న రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పడంతో విచారణను వాయిదా వేశారు. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం సండ్ర చర్లపల్లి జైలులో ఉంటున్నారు. సండ్రకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం విదితమే.