బెలూన్ల ద్వారా ఇంటర్నెట్
వాషింగ్టన్ : సంచనాలకు మారుపేరైన ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ మరో తాజా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను అకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఏ మారుమూల ప్రాంతానికైనా నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయోగాన్ని గూగుల్ నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ సౌకర్యం… ఖరీదైన వ్యవహారంగా మారిపోయి అనేక పేద దేశాలకు అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 480కోట్ల మందికి అది దూరంగానే ఉంది. ఈ డిజిటల్ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో… 18నెలల క్రితం ‘ప్రాజెక్ట్ లూస్’ పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని గూగుల్ అత్యంత రహస్యంగా చేపట్టింది.